చేపలు వండినప్పుడు నీచు వాసనను పోగొట్టే చిట్కాలు !

Telugu Lo Computer
0


చేపలు వండినప్పుడు వంటగది ఎక్కువగా నీచు వాసన వస్తుంటుంది. వంట వండటం పూర్తై గిన్నెలు శుభ్రం చేసిన తర్వాత కూడా ఆ వాసన పోదు. దీనివల్ల కిచెన్‌లోకి అడుగు పెట్టాలంటే ముక్కు ముసుకోవాల్సిన పరిస్థితి.  ఓ గిన్నెలో కొద్దిగా వెనిగర్, కొద్దిగా కాఫీ పొడిని కౌంటర్ టాప్‌లో ఉంచితే నీచు వాసన రాకుండా ఉంటుంది. కాఫీ గింజలను వేయించినా కూడా ఆ వాసనతో ఈ సమస్య దూరమవుతుంది. కొంత మంది వంట వండిన తరవాత వెంటనే చెడు వాసన వస్తోందని ఎయిర్ ఫ్రెషనర్స్‌ను ఉపయోగిస్తుంటారు. కిచెన్‌లో చేపలను వండిన వెంటనే ఇవి వాడొద్దు. ఎందుకంటే ఎయిర్​ఫ్రెష్​నర్​ స్మెల్​ వంటలకు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వంట పూర్తైన తరవాత వండిన గిన్నెలను పక్కన పెట్టి, తర్వాత ఫ్రెషనర్స్ వాడొచ్చు. ఒక పాత్రలో కొన్ని నీళ్లు పోసి దాన్ని స్టవ్ మీద మీడియమ్‌ మంటపై మరిగించాలి. ఆ నీటిలోకి కొన్ని దాల్చిన చెక్క ముక్కలు లేదా పొడి వేయాలి. దీంతో కిచెన్‌లోని నీచు వాసన తొలగిపోయి, మంచి వాసన వస్తుంది. దాల్చిన చెక్కకు బదులుగా కాఫీ గింజలు లేదా నిమ్మ, ఆరెంజ్, యాపిల్ తొక్కల్ని లవంగాలతో కలిపి వేసి మరిగించినా మంచి ఫలితం ఉంటుంది. సెంటెడ్ క్యాండిల్స్ మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. వాటిని వెలిగించిన కూడా నీచు వాసన పోతుంది. ఒక పాత్రలో కొన్ని నీళ్లు పోసి అందులో పచ్చ కర్పూరం వేసి ఇంట్లో ఓ మూలకు పెట్టండి. దీంతో మంచి వాసన వస్తుంది. ఇలా చేయడం వల్ల మరో ఉపయోగం కూడా ఉంది, అదేంటంటే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి. ఒక చిన్న గిన్నెలో వైట్ వెనిగర్‌ని తీసుకుని దాన్ని కిచెన్ ప్లాట్‌ఫాంపై పెట్టండి. ఇది చెడు వాసనలన్నింటినీ దూరం చేస్తుంది. రోజ్‌మేరీ వంటి కొన్ని మంచి వాసనను వేదజల్లే ఆకులు మార్కెట్లో లభిస్తాయి. వీటిని తెచ్చుకుని ఇంట్లో ఎక్కడో ఒక చోట పెట్టండి. దీంతో ఇల్లంతా మంచి వాసనతో నిండిపోతుంది. చేపలు ఫ్రై చేస్తున్నప్పుడు ఓ పాన్‌లో నీరు పోసి మరిగించండి. ఆ మరుగుతున్న నీటిలో రెండు, మూడు చెంచాల వెనిగర్ కలపండి. ఇది వెంటనే గాలిలో కలిసిపోయి వాసనని దూరం చేస్తుంది. ప్రస్తుతం చాలా మంది ఇళ్లల్లో చిమ్నీనీలు అందుబాటులో ఉన్నాయి. నాన్​వెజ్​ వంటకాలు, లేదా ఏదైనా ఫ్రై లు చేసే ముందు ఎగ్జాస్ట్​ వాడటం వల్ల నీచు వాసన పోవడమే కాదు, పొగ కూడా ఉండదు. చేపలు, మాంసం వంటివి వండిన తర్వాత, వీలైనంత త్వరగా కిచెన్‌ను, సింక్‌ను క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల చాలా వరకు వాసన తగ్గిపోతుంది. స్టౌ, కౌంటర్ టాప్స్ క్లీన్ చేయడం వల్ల కూడా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)