ప్రపంచంలోనే ది బెస్ట్ విస్కీ'గా 'ఇంద్రీ' !

Telugu Lo Computer
0


ప్రపంచవ్యాప్తంగా ఉన్న మద్యం బ్రాండ్‌లలో ఏది ఉత్తమమైనదని ప్రతీ ఏటా పోటీ పెడతారు. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో ఇండియన్ విస్కీ ప్రపంచంలోనే 'ది బెస్ట్ విస్కీ'గా నిలిచింది. దాని బ్రాండ్ నేమ్ 'ఇంద్రీ'. భారత్‌లో తయారైన ఈ విస్కీ అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడాతో పాటు ఇతర ప్రపంచ దేశాల్ని వెనక్కి నెట్టేసి వరల్డ్ బెస్ట్ విస్కీగా చరిత్రపుటలకెక్కింది. ఈ ఇంద్రీ విస్కీని 'పికాడిల్లీ డిస్టిలరీస్' అనే సంస్థ తయారు చేస్తోంది. న్యూ ఢిల్లీకి సమీపంలో ఈ సంస్థ ఉంటుంది. సింగిల్ మార్ట్ నుంచి రోజుకు 10 వేల బాటిళ్లను కార్మికులు బయటకు తీస్తున్నారంటే.. ఏ స్థాయిలో ఇది అమ్ముడుపోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో దీని ఉత్పత్తి మరింత గణనీయంగా పెరిగిపోయింది. నాణ్యత విషయంలోనూ రాజీ పడని ఈ భారతీయ విస్కీ.. విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ అవార్డ్స్‌లో 'బెస్ట్ విస్కీ'గా అవార్డ్ దక్కించుకుంది. ఈ పోటీలో వందకు పైగా అంతర్జాతీయ బ్రాండ్స్ పాల్గొనగా.. భారతీయ సింగిల్ మాల్ట్ ఇంద్రీ 'అత్యుత్తమమైనదిగా' ఎంపికైంది. ఈ అవార్డుతో భారత విస్కీలకు ప్రపంచంలోనే అరుదైన గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో.. నాణ్యత, నిబద్ధత కారణంగానే తమ విస్కీకి ఈ అవార్డ్ దక్కిందని పికాడిల్లీ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. రాజస్థాన్‌లో ఎంపిక చేసిన బార్లీ గింజలను.. హిమాలయాల్లో పుట్టిన యమునా నదిలోని తాజా నీటిని ఉపయోగించి.. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ విస్కీని తయారు చేస్తున్నట్టు పికాడిల్లీ సంస్థ తెలిపింది. ఈ విస్కీలో తాము ముదురు తీపి, ఎండు ద్రాక్షలను ఉపయోగిస్తామని వివరించింది. కాగా.. గతంలోనూ ఈ ఇంద్రీ విస్కీకి పలు అవార్డులు వరించాయి. టోక్యో విస్కీ అండ్ స్పిరిట్స్ కాంపిటీషన్ 2023ను ఇంద్రీ కంపెనీకి చెందిన సింగిల్ మార్ట్ ట్రినీ సాధించింది. అలాగే.. ఫిఫ్టీ బెస్ట్ వరల్డ్ విస్కీస్ 2022, ది ఇంటర్నేషనల్ విస్కీ కాంపిటీషన్ ఇన్ లాస్ వేగాస్, ప్రపంచంలోని టాప్ 20 విస్కీస్‌లోనూ ఈ ఇంద్రీ స్థానం సంపాదించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)