కేరళలో కరోనా కలకలం !

Telugu Lo Computer
0


కేరళలో ఒక్కసారిగా ఈరోజు 19 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేగాక, కోవిడ్ 19 కారణంగా రెండు మరణాలు కూడా సంభవించాయి. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో నవంబర్ నెలలో 470 కేసులు ఉండగా.. డిసెంబర్ మొదటి పది రోజుల్లోనే 825 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. శ్వాస సంబందిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన రోగులలో కోవిడ్ కేసులు కొనుగొనబడ్డాయని వైద్యాధికారులు తెలిపారు. ఒమిక్రాన్ జేఎన్1 సబ్ వేరియంట్‌ని దక్షిణాది రాష్ట్రం గుర్తించినట్లు నివేదికలు ఉన్నప్పటికీ వైరస్ పై నిరంతర పర్యవేక్షణ అవసరమని అధికారులు స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం ఆంక్షలు, నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా, భారతదేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోనే ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంఖాల ప్రకారం శుక్రవారం దేశంలో 237 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1296కి పెరిగింది. మరణాల సంఖ్య 5,33,310గా ఉంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,50,03,830గా ఉంది. వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,44,69,536కు పెరిగింది. రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)