ప్రజా భవన్ ఎదుట కారు బీభత్సం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ కారుతో బీభత్సం సృష్టించాడు. హైదరాబాద్ పంజాగుట్టలోని ప్రజాభవన్ ఎదుట తన కారుతో ప్రజలను భయభ్రంతులకు గురి చేశాడు. బీఎండబ్ల్యూ కారుతో బారీకేడ్లను ఢీ కొట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సీపీ శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యి విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు యువకులతోపాటు ముగ్గురు యువతులు ఉన్నట్లు సీపీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే కారు డ్రైవ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అని తెలిసినప్పటికీ స్థానికంగా ఉన్న పోలీసులు మరో యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అబ్దుల్ ఆసిఫ్ అనే యువకుడు కారును డ్రైవ్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. సీపీ ఆదేశాలతో ఘటనపై విచారణ పోలీసులు విచారణ ప్రారంభించారు. కారు డ్రైవ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ అని ప్రాధమికంగా గుర్తించామని చెబుతున్నారు. అబ్దుల్ ఆసిఫ్ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. నిందితుడు సోహెల్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. సోహెల్ గతంలోనూ ప్రమాదాలు చేసినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం మార్చిలో జూబ్లీహిల్స్ లో కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందారు. అయితే ప్రమాదానికి కారణమైన కారులో షకిల్ కుమారుడు సోహెల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)