రేవంత్‌రెడ్డిని కలిసిన నళిని !

Telugu Lo Computer
0

                                          

తెలంగాణ ఉద్యమ సమయంలో తన డీఎస్పీ పదవికి దూరమై వార్తల్లోకి ఎక్కారు నళిని. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆమె పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉద్యమకారులకు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందని, ఆమె కోరుకుంటే అదే ఉద్యోగం కుదరకుంటే వేరే ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సీఎస్‌ను ఆదేశించారు. ఈ తరుణంలో.. శనివారం ఆమె రేవంత్‌రెడ్డిని కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనను ఆమె ఇదివరకే తిరస్కరించారు. తనకు ఉద్యోగంలో ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేవలం మర్యాదపూర్వక భేటీ జరిగిందంతే. గత సమీక్షలో తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్‌ అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అధికారులు సమాచారం అందించగా ఆమె సీఎం రేవంత్‌ను ఇవాళ కలిశారు. ''సీఎం రేవంత్ రెడ్డిని కలువడం సంతోషంగా ఉంది. ఉద్యోగం ఇప్పుడు నాకు అవసరం లేదు. డబ్బు, భౌతిక ప్రపంచం నుండి బయట పడ్డాను. ఇప్పుడు నాది ఆధ్యాత్మిక మార్గం. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం అడిగాను. సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వేదం , యజ్ఞం పుస్తకాలు పూర్తి చేస్తున్నా. సనాతన ధర్మం ప్రచారం చేస్తా. గతంలో నేను, సహఉద్యోగులు డిపార్ట్ మెంట్లో ఎదుర్కొన్న సమస్య పై సీఎంకు రిపోర్ట్ ఇచ్చాను. నాలాగా ఎవరు భాద పడవద్దన్నదే నా అభిప్రాయం. అప్పుడే నాకు బ్యూరోక్రసీ మీద నమ్మకం పోయింది. అందుకే ఆధ్యాత్మిక బాట ఎంచుకున్నా. నా విషయంలో జరిగిన అన్ని పరిణామాలు సీఎం దృష్టికి తీసుకెళ్లా. ఇప్పుడు నా మనసుకు నచ్చినట్లు సేవ చేస్తున్నా. ఇన్నాళ్ల నా మనోవ్యధను గుర్తించినందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి.. సీఎం రేవంత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారామె.

Post a Comment

0Comments

Post a Comment (0)