తిరుమలలో మరోసారి పులి ఎలుగుబంటి సంచారం !

Telugu Lo Computer
0


తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత, ఎలుగుబంటి సంచారం కలకలం రేపాయి. పులి ,ఎలుగుబంటి కదలికలు డిసెంబర్ 13, 29 తేదీల్లో ట్రాప్ కెమెరాలో నమోదయ్యాయి. నెల రోజుల్లో రెండు సార్లు వీటి కదలికలు ట్రాప్ కెమెరాలో నమోదవ్వడంతో భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. నడక మార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నడకమార్గంలో భక్తులు అందరూ గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు భక్తులకు సూచించారు. ఈ ఘటనపై ఈవోకు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రదేశంలోనే పులి సంచరించడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)