జనవరి 5న దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం

Telugu Lo Computer
0


అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ఆస్తుల వేలానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జనవరి 5న దావూద్ ఆస్తులను వేలం వేయనున్నారు. మహారాష్ట్రలోని ముంబై, రత్నగిరి ఏరియాల పరిధిలో దావూద్ పేరిట ఉన్న పలు స్థిరాస్తులను విదేశీ మారక ద్రవ్య చట్టం (సఫ్మా) కింద అధికారులు సీజ్ చేశారు. రత్నగిరి పరిధిలోని ఖేడ్ తాలూకాలో ఉన్న బంగ్లాలు, మామిడి తోటలు సహా నాలుగు ఆస్తులు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. వాటన్నింటిని వచ్చే నెల 5వ తారీఖున వేలం వేస్తారు.దావూద్ ఆస్తులను వేలం వేయడం ఇదే తొలిసారేం కాదు. గతంలో దావూద్ సంబంధీకులకు చెందిన ఓ రెస్టారెంట్‌ను రూ.4.53 కోట్లకు, ఆరు ఫ్లాట్లను రూ.3.53 కోట్లకు, ఒక గెస్ట్ హౌస్‌ను రూ.3.52 కోట్లకు కేంద్ర సర్కారు వేలం వేసింది. చివరిసారిగా 2020 డిసెంబరులో రత్నగిరిలోని దావూద్ ఆస్తులను వేలం వేయగా కేంద్ర ప్రభుత్వానికి రూ.1.10 కోట్లు వచ్చాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)