డిసెంబర్‌ 30 నుంచి అమృత్ భారత్ రైళ్లు ?

Telugu Lo Computer
0


డిసెంబర్‌ 30 నుంచి  అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో కొత్త రైళ్లను అందుబాటులోకి ఇండియన్ రైల్వేతీసుకురానుంది. ఈ రైలును ప్రధాని మోడీ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ డిసెంబర్‌ 30 ప్రధాని అయోధ్యలో విమానాశ్రయాన్ని, ఆరు వందేభారత్‌ రైళ్లను ప్రారంభించనున్నారు. మొదట రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమవుతాయని, అందులో ఒకటి అయోధ్య నుంచి దర్భంగ మధ్య నడస్తుందని, రెండోది దక్షిణ భారతదేశంలో నడుస్తుందని అధికారులు చెప్పుకొచ్చారు. అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మొత్తం 22 బోగీలు ఉంటాయి. వీటిలో 12 సెకండ్ క్లాస్ 3 టైర్ స్లీపర్ కోచ్‌లు, 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు గార్డు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. గార్డు కంపార్ట్‌మెంట్లలో విడిగా కోచ్‌లు ఉంటాయి. మహిళలు, దివ్యాంగులైన ప్రయాణికులకు సీటింగ్ ఉంటుంది. ఈ రైలు సగటున గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. ఈ రైలుకు ముందు, వెనక ఇంజన్లు ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)