మోడీ ఆరోపణలు నిరాధారం !

Telugu Lo Computer
0


రాజస్తాన్ లోని జైపూర్‌లో నిర్వహించిన ఒక మీడియాలో సమావేశంలో జైరాం రమేశ్ విలేకరులతో మాట్లాడుతూ  రాష్ట్రంలోని తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపుతోందని మోడీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, అవి పూర్తిగా నిరాధారమైనవని తోసిపుచ్చారు. గత ఐదేళ్లలో రాజస్తాన్ ఒక మోడల్ రాష్ట్రంగా మారిందని, అది చూసి ప్రధాని భయపడుతున్నారని దుయ్యబట్టారు. మోడీకి ఇతర సమస్యలేమీ కనిపించకపోయేసరికి కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను రాష్ట్రానికి పంపారని ఎద్దేవా చేశారు. ఈడీ, సీబీఐలతో దాడులు చేయించడం తప్ప, బీజేపీకి మరో వ్యూహం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల గురించి బీజేపీ ఎప్పుడూ మాట్లాడదని, ఎందుకంటే ఆ పార్టీ మాట్లాడే స్థితిలో లేదని కౌంటర్ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న పోర్టులు, విమానాశ్రయాలు, పరిశ్రమల ప్రైవేటీకరణ దేశ ప్రయోజనాల కోసం కాదని, ఉపాధి తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని కేంద్రంపై మండిపడ్డారు. ప్రధాని మోడీతో పాటు ఆయన సహచరులు పదే పదే పోలరైజేషన్ గురించి మాట్లాడుతూనే ఉన్నారని జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రజలు పోలరైజేషన్‌ని తిరస్కరించారని, రాజస్తాన్  ప్రజలు సైతం రాబోయే ఎన్నికల్లో ఈడీ, సీబీఐ రాజకీయాలతో పాటు పోలరైజేషన్‌ను తిరస్కరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే రాజస్తాన్ ప్రజలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రతీకార రాజకీయాలతో విసిగిపోయారన్నారు. ప్రభుత్వం చేస్తున్న పోర్టులు, విమానాశ్రయాలు, పరిశ్రమల ప్రైవేటీకరణ దేశ ప్రయోజనాల కోసం కాదని, ఉపాధి తగ్గడానికి కూడా ఇదొక కారణమని కేంద్రంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదు కాబట్టి కాంగ్రెస్‌కు మరోసారి ప్రజా తీర్పు వస్తుందని రమేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)