రాజస్థాన్‌ లో రాళ్లు రువ్వుకున్న రెండు వర్గాలు !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలోని ఫతేపూర్‌లో శనివారం పోలింగ్‌ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర బలగాలు వెంటనే ఆ పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నాయి. పరిస్థితిని చక్కదిద్దాయి. ఒక పోలింగ్‌ బూత్‌ సమీపంలో రెండు వర్గాలకు చెందిన ప్రజలు ఘర్షణకు దిగారు. రాళ్లు విసురుకున్నారు. సమీపంలోని ఇళ్లు, భవనాల పైనుంచి కూడా రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర బలగాలకు చెందిన పారామిలిటరీ దళాలు, పోలీసులు ఆ పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఘర్షణకు దిగిన గ్రూపులను చెదరగొట్టారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సంఘటన నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిన పోలింగ్‌ అనంతరం కొనసాగింది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మరోవైపు రాజస్థాన్‌ వ్యాప్తంగా 51,000 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరుగుతున్నది.


Post a Comment

0Comments

Post a Comment (0)