ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ గా కోహ్లీ !

Telugu Lo Computer
0


భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ ముగిసింది. ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించాడు. 11 మ్యాచుల్లో 765 పరుగులు చేశాడు. ఓ ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. ఈ మెగాటోర్నీలో కోహ్లీ మూడు సెంచరీలు, ఆరు అర్ధశతకాలు బాదాడు. సెమీ ఫైనల్‌లో సెంచరీ చేసిన కోహ్లీ, ఫైనల్ మ్యాచులోనూ 54 పరుగులతో రాణించాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ కార్యక్రమంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు రోజర్ బిన్నీ చేతుల మీదుగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. విరాట్ కోహ్లీ 765 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఆ తరువాత వరుసగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ (597 పరుగులు) దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ (594 పరుగులు), న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర (578 పరుగులు) ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)