మా వాళ్ళు నలుగురిని లోపలేస్తే - నేను 8 మందిని జైలుకు పంపుతా !

Telugu Lo Computer
0


బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన నలుగురిని కేంద్ర ఏజెన్సీలు అరెస్ట్ చేశాయని, రాష్ట్ర పోలీసులు ఇందుకు ప్రతిగా 8 మంది బీజేపీ నాయకులను జైలులో పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో జరిగిన పార్టీ సమావేశంలో టీఎంసీ అధినేత్రి బీజేపీకి హెచ్చరికలు జారీ చేశారు. ''మీరు ఈ రోజు నవ్వుతున్నారు, ఎందుకంటే మా పార్టీ నేతలు అనుబ్రత మోండోల్, పార్థ ఛటర్జీ, మాణిక్ భట్టాచార్య, జ్యోతి ప్రియా మల్లిక్ మరియు మరికొంత మంది నాయకులు జైలులో ఉన్నారు. ఈ సంప్రదాయం కొనసాగుతుంది. భవిష్యత్తులో మీరు కుర్తీలో లేనప్పుడు ఎక్కడ ఉంటారు..? జైలులో'' అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఏదైనా చేస్తామని అనుకుంటున్నారని, మీరు టీఎంసీ నాయకులను, అరవింద్ కేజ్రీవాల్, అశోక్ గెహ్లాట్ కుమారుడిని ఇతర నాయకులపై ఈడీ, సీబీఐని ఉపయోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో అదే అధికారులు మీ వెంట పడతారని, మిమ్మల్ని ఎవరూ రక్షించలేరని ఆమె అన్నారు. ప్రస్తుతం 2024 ఎన్నికల ముందు వరకు ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసుకుంటున్న కేంద్ర ఏజెన్సీలు, ఆ తర్వాత బీజేపీ వెంట పడుతాయని ఆమె అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రిజర్వేషన్లు తొలగించాని కోరుకుంటోందని, దానిని వ్యతిరేకిస్తామని, మైనారిటీ రిజర్వేషన్లకు కూడా బీజేపీ వ్యతిరేకమని ఆరోపించారు. మెట్రో రైలు నుంచి క్రికెట్ వరకు అన్నింటిని బీజేపీ కాషాయికరణ చేయాలనుకుంటోందని మండిపడ్డారు. క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కాషాయం జెర్సీని ధరించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రపంచకప్ ఫైనల్ అహ్మదాబాద్‌లో కాకుండా కోల్‌కతా, ముంబైలో జరిగితే మనం గెలిచే వాళ్లమని, పాపులు హాజరైన మ్యాచ్ మినహా అన్ని మ్యాచుల్ని గెలిచామని పరోక్షంగా ప్రధానిని ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)