రూ.200 కోట్లు ఇస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా !

Telugu Lo Computer
0


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, విపక్ష నేతలు సై అంటే సై అంటున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు సంధించుకుంటున్నారు. తాజాగా అందోల్ ఎమ్మెల్యే క్రాంతి.. తన ప్రత్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం దామోదర రాజనర్సింహ రూ.200కోట్లు ఖర్చు పెడుతున్నారని క్రాంతి ఆరోపించారు. ఎన్నికల్లో విజయం కోసం సర్పంచ్ కు 5 లక్షలు, జడ్పీటీసీకి 20 లక్షలు, కౌన్సిలర్ కి 25 లక్షలు ఇస్తానని దామోదర రాజనర్సింహ ఆశ చూపుతున్నారని క్రాంతి చెప్పారు. ఆ 200 కోట్లు అందోల్ నియోజకవర్గ అభివృద్ధికి ఇవ్వాలని ఆయన కోరారు. 200 కోట్లు అందోల్ నియోజకవర్గానికి ఇస్తే, తాను ఎన్నికల బరి నుండి తప్పుకుంటానని ఎమ్మెల్యే క్రాంతి ప్రకటించారు. ”నేను భూకబ్జా చేశానని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. కబ్జా చేసి ఉంటే, ఆ భూములు ఎక్కడున్నాయో చెప్పాలి. వాటిని అమ్మకం పెట్టి ఎన్నికల ఖర్చు కోసం వాడుకుంటాను. నీలం మధుకు అన్యాయం చేశారు. డబ్బు తీసుకుని టిక్కెట్లు అమ్ముకున్నావని మీ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఏ ఒక్క వర్గం కోసం దామోదర రాజనర్సింహ పాటు పడలేదు. మీతో కలిసి పని చేసిన వాళ్లకు ఎక్కడా ఆదుకున్న దాఖలాలు కూడా లేవు” అని ఎమ్మెల్యే కాంత్రి మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)