ఐస్​ల్యాండ్​లో 14 గంటల్లో 800 భూకంపాలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 11 November 2023

ఐస్​ల్యాండ్​లో 14 గంటల్లో 800 భూకంపాలు !


స్​ల్యాండ్​ లో 14 గంటల వ్యవధిలో 800కు పైగా భూకంపాలు సంభవించాయి. దీని ఫలితంగా అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించింది. ఐస్​ల్యాండ్​లోని నైరుతి ప్రాంతంలో ఉన్న రేక్జాన్స్ ద్వీపకల్పాన్ని భూప్రకంపనలు వణికించాయి. అయితే ఆ ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతం బద్ధలయ్యే ముందు, భూకంపాలు సంభవిస్తున్నాయని, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. "భూకంపాల తీవ్రత మరింత పెరగొచ్చు. తద్వారా అగ్నిపర్వతం బద్ధలయ్యే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎమర్జెన్సీని విధిస్తున్నాము," అని ఐస్​ల్యాండ్​ సివిల్​ ప్రొటెక్షన్​ అండ్​ ఎమర్జెన్సీ మేనేజ్​మెంట్​ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. అగ్నిపర్వత ఇప్పటి నుంచి ఎప్పుడైనా బద్ధలవ్వొచ్చని ఐస్​ల్యాండ్​ వాతావరణశాఖ పేర్కొంది. అగ్నిపర్వతం లోపల ఉన్న లావా బయటకు రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు.. రేక్జాన్స్​కు 40 కి.మీల దూరంలో రెండు భూకంపాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత.. గ్రిండవిక్​ అనే ప్రాంతాన్ని వరుస భూకంపాలు వణికించాయి. ఆ ప్రాంతంలో దాదాపు 4వేల మంది నివాసముంటున్నారు. పరిస్థితులు మరింత తీవ్రంగా మారితే.. వారందరిని అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రిండవిక్​ ప్రాంతంలో ఎమర్జెన్సీ షెల్టర్లు, హెల్ట్​ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది స్థానిక యంత్రాంగం. కాగా.. ఐస్​ల్యాండ్​లో తాజాగా వచ్చిన భూకంపాల్లో గరిష్ఠ తీవ్రత రిక్టార్​ స్కేల్​పై 5.2గా నమోదైనట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఉన్న రేక్జాన్స్ ద్వీపకల్పంలో 14 గంటల వ్యవధిలో 800 భూకంపాలు సంభవించగా.. అక్టోబర్​ నుంచి మొత్తం మీద 24వేల ప్రకంపనలు రికార్డు అయ్యాయి.

No comments:

Post a Comment