'ది వైర్‌' రిపోర్టులకు అవార్డులు

Telugu Lo Computer
0


"ది వైర్‌" న్యూస్‌ పోర్టల్‌లో ప్రచురితమైన రెండు రిపోర్టులకు అవార్డులు దక్కాయి. సయాంతన్‌ దత్త రాసిన ఆర్టికల్‌, పవన్‌జోత్‌ కౌర్‌, సౌమాశ్రీ సర్కార్‌లకు చెందిన వీడియోలు 2023 సంవత్సరానికి గానూ లాడ్లి మీడియా అవార్డులను పొందాయి. దత్త రాసిన ఆర్టికల్‌ 'ఇండియన్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ క్యూరియస్‌ పెంచాంట్‌ ఫర్‌ జెండర్డ్‌ హాస్టల్స్‌' ది వైర్‌ సైన్స్‌లో ప్రచురితమైంది. ఇది ఇంగ్లీష్‌ (ఫీచర్స్‌) విభాగంలో అవార్డును దక్కించుకున్నది. ఇక కౌర్‌, సర్కార్‌లకు చెందిన వీడియో రిపోర్టు.. దక్షిణ బెంగాల్‌కు చెందినది. ఇందులో రెండు గ్రామాలలో వాతావరణ పరిస్థితులు, అక్కడి మహిళలు చేసిన కృషి గురించి వివరించారు. ఇది కూడా ఇంగ్లీష్‌ (ఫీచర్‌) విభాగంలో అవార్డును సొంతం చేసుకున్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)