సుప్రీంకోర్టులో లిస్టయిన ఓటుకు నోటు కేసు !

Telugu Lo Computer
0

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మరో పిటీషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైన ఓటు కు నోటు కేసులో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తాజాగా సుప్రీంలో రెండు పిటీషన్లు దాఖలు చేసారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఈ కేసు అక్టోబర్ 4న లిస్టు అయింది. అక్టోబర్ 3న స్కిల్ స్కాంలో సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటీషన్ విచారణ జరగనుంది. మరుసటి రోజునే ఈ పిటీషన్ లిస్టు అయింది. ఓటు కు నోటు కేసు: మరో సారి ఓటు కు నోటు కేసు తెర పైకి వచ్చింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే..ఇదే సమయంలో తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేసారు. 2017 లోనూ ఈ పిటీషన్లను దాఖలు చేయగా..ఈ నెల 4న సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం దగ్గర ఓటుకు నోటు కేసు లిస్టు అయింది. అప్పట్లో రేవంత్ రెడ్డి చుట్టే తిరిగిన ఓటుకు నోటు వ్యవహారం లో చంద్రబాబు పాత్ర పైన ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంను ఆశ్రయించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)