తుర్కియే నుంచి దౌత్యవేత్తలను వెనక్కి పిలిచిన ఇజ్రాయెల్‌ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 29 October 2023

తుర్కియే నుంచి దౌత్యవేత్తలను వెనక్కి పిలిచిన ఇజ్రాయెల్‌ !


గాజాలో ఇజ్రాయెల్‌ చేపట్టిన హమాస్‌ ఏరివేత ఆపరేషన్‌ తుర్కియేతో విభేదాలను తీసుకొచ్చింది. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ తమ దేశంపై చేసిన వ్యాఖ్యలకు ఐరాసలోని ఇజ్రాయెల్‌ ప్రతినిధి గిలాద్‌ మండిపడ్డారు. 'పాము ఎప్పటికీ పామే' అని కఠినంగా వ్యాఖ్యానించారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ తన ఇమేజిని పెంచుకోవాలని ప్రయత్నించినా,  ఆయన యూదు వ్యతిరేకిగానే ఉండిపోయారన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్‌ కూడా ట్విటర్‌లో తీవ్రంగా స్పందించారు. ''తుర్కియే నుంచి దారుణమైన ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో.. మా దేశ దౌత్య ప్రతినిధులను వాపస్‌ వచ్చేయాలని ఆదేశిస్తున్నాను. తుర్కియే-ఇజ్రాయెల్‌ సంబంధాలను పునఃసమీక్షించాల్సి ఉంది'' అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఎర్డోగాన్‌ పార్టీ కార్యకర్తలు శనివారం ఇస్తాంబుల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇజ్రాయెల్‌ యుద్ధ నేరస్థుల తరహాలో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏ దేశానికైనా తనను తాను రక్షించుకునే హక్కు ఉంటుందని, కానీ ఈ ఘర్షణలో న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ డిమాండు చేశారు. 'గాజాపై ఇజ్రాయెల్‌ బాంబు దాడులను తీవ్రతరం చేసింది. మానవతా సంక్షోభం మరింత పెరిగింది. ఇకనైనా మీ తెలివి తక్కువ తనానికి ముగింపు పలకండి. ఇజ్రాయెల్‌ దాడులను వెంటనే ఆపేయండి' అని ఎక్స్‌ వేదికగా ఎర్డోగాన్‌ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. 

No comments:

Post a Comment