రాహుల్ గాంధీపై ఏఐఎంఐఎం ఆగ్రహం !

Telugu Lo Computer
0

రాహుల్ గాంధీ  ఈ మధ్య గోవా వెళ్లిన సందర్భంగా అక్కడి నుండి ఓ కుక్క పిల్లను తీసుకొచ్చి ప్రపంచ జంతు దినోత్సవం సందర్బంగా తల్లి సోనియాకు ఆ కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చారు. దానికి ‘నూరీ’ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ పేరే సోనియా, రాహుల్ ను వివాదంలో పడేశాయి. కుక్క పిల్లకి నూరీ అని పేరు పెట్టడం అంటే ఇస్లాం మతాన్ని అవమానించినట్లే అని ఏఐఎంఐఎం అధికార ప్రతినిధి మహ్మద్‌ ఫర్హాన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మహిళలను అవమానించినట్లే అని పేర్కొన్నారు. కుక్కకు నూరీ అని పేరు పెట్టడం అంటే ఇస్లాం మతానికి చెందిన లక్షలాది మంది మహిళలను అవమానించడమే అని ఆయన పేర్కొన్నారు. రాహుల్‌ తన తల్లి సోనియా కు బహుమతిగా ఇచ్చిన ఈ కుక్కపిల్ల జాక్‌ రస్సెల్‌ జాతికి చెందినది. రాహుల్‌ తన గోవా ట్రిప్పులో ఉన్నప్పుడు షర్వాణి పిత్రే అనే ఆమె తన భర్తతో కలిసి నడుపుతున్న కుక్కల కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆ సమయంలో ఆయన నూరీ అనే కుక్క పిల్లను తీసుకుని ప్రత్యేకంగా తల్లికి బహుమతిగా ఇచ్చారు. అతనికి కుక్కపిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆ ఇష్టమే రాహుల్ లో వివాదంలో పడేసేలా చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)