బిస్కెట్స్ దొంగిలించారని చితకబాదిన కిరాణా కొట్టు యజమాని

Telugu Lo Computer
0


బీహార్‌లో బేగుసరాయ్ జిల్లా బీర్పూర్ తాలుకాలోని ఫాజిల్పూర్ గ్రామంలో ఓ కిరాణా కొట్టు ఉంది. అయితే ఆ గ్రామంలోని నలుగురు చిన్నారులు ఈ నెల 28వ తేదీన ఆ షాప్ నుంచి కుర్ కురే, బిస్కెట్ ప్యాకెట్లను దొంగిలించారు. అయితే, ఈ విషయం గమనించిన యజమాని ఆ పిల్లల్ని పట్టుకుని దగ్గరలోని ఓ పోల్ దగ్గరకి తీసుకెళ్లాడు. ఆ పోల్‌కు వారి చేతులను కట్టేసి, ఆ తర్వాత వారిని అత్యంత క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడు.అయితే, అక్కడే ఉన్నవారంతా ప్రేక్షకపాత్ర వహించారే కానీ, యజమానిని అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు ఈ సంఘటను వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పిల్లల్ని తీవ్రంగా చితకబాది అనంతరం వారిని విడిచిపెట్టాడు. ఆ దెబ్బలతో ఎంతో దీన పరస్థితిల్లో ఆ చిన్నారులు వారి ఇళ్లకు వెళ్లారు. పిల్లల పరిస్థితి చూసి ఏం జరిగిందని తల్లిదండ్రులు ప్రశ్నించగా, జరిగిన విషయమంతా వివరించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు యజమానిపై ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో అక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే బాలురను పోల్ కు కట్టేసి, కొట్టిన ఘటనను అక్కడున్న పలువురు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో ఈ ఘటన కాస్త వైరల్ గా మారి, చివరకు అక్కడి పోలీసుల వరకూ చేరింది. బాధితులను గుర్తించిన పోలీసులు వారి తల్లిదండ్రులను సంప్రదించారు. అయితే, ఆ షాప్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని వారిని కోరారు. అందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో బెగుసరాయ్ ఎస్పీ స్పందిస్తూ.. పిల్లలపై ఈ విధంగా ప్రవర్తించడం తప్పని, చిన్నపిల్లలపై ఇలాంటి చర్యలు తీసుకోవడం తీవ్రమైన నేరం కింద పరిగణిస్తామని అన్నారు. ఆ షాప్ యజమానిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)