ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతున్నారు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 18 September 2023

ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతున్నారు !


పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  సీబీఐ, ఈడీ దాడులపై స్పందిస్తూ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ''మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భారతదేశానికి పునాది పునాది వేశారు. అయితే.. పునాదిలో ఉపయోగించిన రాళ్లను ఎవరూ చూడలేరు. కేవలం గోడలపై రాసినవి మాత్రమే కనిపిస్తాయి. బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల వ్యవస్థకు గణనీయమైన లోపాలు ఏర్పడుతాయని నెహ్రూ విశ్వసించారు. బలమైన ప్రతిపక్షం లేకపోతే సరికాదు. ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉంది కానీ.. ఈడీ, సీబీఐ దాడులతో దాన్ని బలహీనపరచడంపై కేంద్రం దృష్టి సారించింది'' అని చెప్పారు. తొలుత ప్రతిపక్ష నాయకుల్ని తమ సొంత పార్టీలోకి చేర్చుకొని, వారిని వాషింగ్ మెషీన్‌లో పెడుతున్నారని.. అనంతరం వాళ్లు ఎలాంటి ఆరోపణలు లేకుండా క్లీన్‌గా బయటకొచ్చి, తమ పార్టీలో పర్మినెంట్‌గా ఉంచుకుంటున్నారని.. ఈరోజుల్లో ఇదే జరుగుతుండటాన్ని అందరూ చూడొచ్చని ఖర్గే అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ  చాలా అరుదుగా పార్లమెంట్‌కి వస్తారని, ఆయన వచ్చినప్పుడు దాన్నొక ఈవెంట్‌గా మార్చేసి వెళ్లిపోతారని చురకలంటించారు. ఇదే సమయంలో తమ ఇండియా కూటమిని కేవలం 'ఇండి'గా పిలుస్తుండటంపై ఖర్గే తనదైన శైలిలో స్పందించారు. కేంద్రంలోని బీజేపీ పార్టీ ఇండియా కూటమిని కార్నర్ చేసేందుకు కేవలం ఇండి అని పిలుస్తోందని, అయితే వాళ్లు ఏ పేరుతో పిలిచినా తామంతా 'ఇండియా' వాళ్లమేనని అన్నారు. పేరు మార్చినంత మాత్రాన ఎలాంటి నష్టం కలగదని తేల్చి చెప్పారు. ఇక మణిపూర్ అంశాన్ని మరోసారి తెరమీదకి తీసుకొచ్చి దేశంలోని ప్రతి ప్రాంతాన్ని ప్రధాని సందర్శిస్తారని, కానీ మణిపూర్‌కు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు.

No comments:

Post a Comment