వేదాంత అక్రమాలను బయటపెట్టిన ఓసిసిఆర్‌పి !

Telugu Lo Computer
0


వేదాంత గ్రూప్ అక్రమాలను ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (ఒసిసిఆర్‌పి) శుక్రవారం బట్టబయలు చేసింది. కరోనా మహమ్మారి సమయంలో కీలక పర్యావరణ నిబంధనలను బలహీనపరిచేలా వేదాంత రహస్య లాబీయింగ్‌ నిర్వహించినట్లు ఓసిసిఆర్‌పి నివేదిక తెలిపింది. ప్రజల నుండి అభిప్రాయ సేకరణ చేయకుండానే మోడీ ప్రభుత్వం అక్రమ పద్ధతుల్లో ఈ మార్పులను ఆమోదించిందని వెల్లడించింది. ఓ సందర్భంలో నూతన పర్యావరణ అనుమతులు లేకుండా మైనింగ్‌ కంపెనీలు 50 శాతం వరకు ఉత్పత్తి చేయగలవని వేదాంత కంపెనీ వాదించినట్లు నివేదిక పేర్కొంది. వేదాంతకు చెందిన ఆయిల్‌ కంపెనీ కెయిర్న్‌ ఇండియా ప్రభుత్వ వేలంలో గెలిచిన చమురు బ్లాక్‌లలో డ్రిల్లింగ్‌ కోసం బహిరంగ విచారణ లేకుండా లాబీయింగ్‌ నిర్వహించినట్లు తెలిపింది. అప్పటి నుండి స్థానికంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నప్పటికీ.. రాజస్తాన్‌లో కెయిర్న్‌ సంస్థకు ఆరు వివాదాస్పద చమురు బ్లాక్‌లను ఆమోదించినట్లు వెల్లడించింది. లాభాపేక్ష లేని సంస్థ అయిన ఒసిసిఆర్‌పి గురువారం అదానీ గ్రూపు అక్రమాలను వెలికితీసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్‌ తన కంపెనీల స్టాక్‌ధరలను తారుమారు చేసి, వాటి ఆస్తుల విలువలను అడ్డగోలుగా పెంచేందుకు అక్రమాలకు పాల్పడిందన్న ఆధారాలను వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)