బైక్ పై రొమాన్స్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 16 September 2023

బైక్ పై రొమాన్స్ !


రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ జంట బైక్‌పై ముద్దులు పెట్టుకుంటూ కెమెరాకు చిక్కింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రమాదకరమైన కిస్సింగ్ స్టంట్ వీడియో సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది. కదులుతున్న మోటార్‌సైకిల్‌పై ఈ జంట ప్రమాదకరంగా ముద్దుల విన్యాసాలు చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో రెండు రోజుల నాటిదని, జైపూర్‌లో చిత్రీకరించినట్లు సమాచారం. ఈ వీడియోలో బైక్ పై వెళ్తున్న ఇద్దరూ హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడాన్ని చూడవచ్చు. ఒక వ్యక్తి బైక్ నడుపుతుండగా, వెనుక సీట్లో ఒక మహిళ పిలియన్ రైడర్‌గా కూర్చొని ఉంది. అతను బైక్‌ను అతి వేగంతో నడుపుతుండగా.. వెనుక కూర్చున్న స్త్రీని ముద్దుపెట్టుకోవడానికి వెనుకకు తిరిగాడు. బైక్ కదులుతున్న సమయంలో వారిద్దరూ కొంత సేపు లిప్ లాక్ చేసుకున్నారు. ఇద్దరూ కదులుతున్న బైక్‌పై రోడ్డువైపు చూడకుండా ముద్దులు పెట్టుకున్నారు. రద్దీగా ఉండే జైపూర్‌లోని దుర్గాపుర ప్రాంతంలో ఈ సంఘటన నమోదైంది. బైక్‌పై వీరిద్దరూ ఇలా ముద్దులు పెట్టుకోవడంతో పెను ప్రమాదం జరిగి ఉండేది. బైక్‌పై వెళుతున్న సమయంలో వీరు ముద్దులు పెట్టుకున్న ఘటన మొత్తాన్ని ఓ వీక్షకుడు కెమెరాలో బంధించాడు. జైపూర్ రోడ్లపై మోటర్‌బైక్‌పై ప్రయాణిస్తుండగా చేసిన ఈ చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంట బైక్‌పై ముద్దులు పెట్టుకుంటూ, రోడ్డువైపు చూడకుండా ఉండటం వారికే కాదు, రోడ్డుపై వెళ్లే పాదాచారులకు, ఇతర రైడర్‌లకు కూడా ప్రమాదకరం. ఈ వైరల్ వీడియోను తాము చూశామని, దీనికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఈ వీడియోలో ఉన్న బైక్ యజమానిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment