ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు ఉన్న కుర్రాడిగా సిదక్‌దీప్‌ సింగ్ చాహల్‌ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 16 September 2023

ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు ఉన్న కుర్రాడిగా సిదక్‌దీప్‌ సింగ్ చాహల్‌ !


త్తరప్రదేశ్‌కు చెందిన 15 ఏళ్ల సిదక్‌దీప్‌ సింగ్ చాహల్‌  పుట్టినప్పటి నుంచి  ఇప్పటివరకు తన జుట్టును కత్తిరించుకోలేదు. అదే ఇప్పుడు అతడికి అరుదైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు ఉన్న కుర్రాడిగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ 2024 బుక్‌లో చోటు సంపాదించుకున్నాడు. ఈ విషయాన్ని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ అధికారికంగా ప్రకటిస్తూ సిదక్‌దీప్‌ వీడియోను షేర్‌ చేసింది. మత సంప్రదాయాలను పాటించే సిదక్‌దీప్‌ కుటుంబం చిన్నప్పటి నుంచి అతడి జుట్టును కత్తిరించలేదు. దీంతో ఈ 15 ఏళ్లలో అతడి జుట్టు ఏకంగా 146 సెంటీమీటర్లు పెరిగింది. ఈ రికార్డు దక్కడం పట్ల సిదక్‌దీప్‌ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే చిన్నతనంలో ఈ జుట్టు అంటే తనకు అస్సలు ఇష్టం ఉండేది కాదని.. కానీ, ఇప్పుడదే తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందని సంబరపడ్డాడు. ''చిన్నప్పుడు నా జుట్టు చూసి నా స్నేహితులు ఏడిపించేవారు. దీంతో జట్టు కత్తిరించుకుంటానని ఇంట్లో గొడవ చేసేవాణ్ని. కానీ, ఆ తర్వాత దీనిపై నాకు ఇష్టం పెరిగింది. ఇప్పుడు ఇది నా జీవితంలో ఒక భాగమైంది. అయితే, జుట్టు పెంచుకోవడం అంత సులువు కాదు. వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తా. అందుకు కనీసం ఓ గంట పడుతుంది. జుట్టు శుభ్రం చేసుకోవడానికి మా అమ్మ నాకు సాయం చేస్తుంది. లేదంటే నాకు ఓ రోజంతా సమయం పడుతుంది. నా జట్టు పొడవు చూసి బంధువులు ఆశ్చర్యపోయారు. రికార్డు వచ్చిందని చెప్పినప్పుడు కూడా ఎవరూ నమ్మలేదు'' అని సిదక్‌దీప్‌ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

No comments:

Post a Comment