నీతి ఆయోగ్‌ భవిష్యత్‌ ప్రణాళికలో వైజాగ్‌ స్థానం కల్పించిన కేంద్రం !

Telugu Lo Computer
0


నీతి ఆయోగ్‌ గ్రోత్‌ హబ్‌ నగరాల్లో విశాఖకు కేంద్ర ప్రభుత్వం చోటు కల్పించింది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నాలుగు నగరాలను నీతి ఆయోగ్‌ ఎంపిక చేయగా అందులో వైజాగ్‌కు చోటు దక్కింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి విశాఖను ఎంపిక చేయగా, మిగతా వాటిలో ముంబై, సూరత్‌, వారణాసి ఉన్నాయి. వీటిని పైలట్‌ నగరాలుగా కేంద్రం ఎంచుకుంది. 2047 అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చేందుకు పైలట్ ప్రాజెక్టు ప్రవేశపెట్టగా, తాజాగా ఎంపికైన నాలుగు నగరాలలో పైలట్‌ ప్రాజెక్టు అమల్లోకి రానుంది. నీతి ఆయోగ్‌ ఎంపిక చేసిన నగరాల్లో భారీ ఎత్తున ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయనుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)