కెనడాలో భారతీయ విద్యార్థుల అగచాట్లు !

Telugu Lo Computer
0


కెనడాలో విద్యనభ్యసించేందుకు వెళ్లిన భారతీయులు నానా అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండి లేకపోవడంతో బ్రెడ్‌ తింటూ కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు ఉండేందుకు ఇల్లు కూడా లేకపోవడంతో రోడ్లపైను పడుకుంటున్నారు. 2022లో అత్యధికంగా 2,26,450 మంది విద్యార్థులు కెనడాకు వెళ్లారు వీరందరికీ వసతి కల్పించడంలో అక్కడి వర్సిటీలు విఫలమవుతున్నాయి. దీంతో చెట్ల కింద, టెంట్లు వేసుకొని ఉండాల్సిన దుస్థితి తలెత్తింది. మరోవైపు అష్టకష్టాలు పడి చదువు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెనడాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ విద్యార్థుల కష్టాలు మరింత పెరిగాయి. భారత్‌తో వివాదంలో తలమునకలైన ట్రూడోకు గట్టి షాక్‌ తగిలింది. ఆ దేశంలో ట్రూడో పాపులారిటీని గణనీయంగా కోల్పోయారు. సుమారు 60 శాతం మంది ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు గ్లోబల్‌ న్యూస్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. అదే సమయంలో ప్రతిపక్ష నేత పియరీకి జనాధరణ పెరుగుతున్నది. 40 శాతం మంది పియరీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)