బ్లూ డార్ట్ ను భారత్ డార్ట్ గా మార్చిన కొరియర్ సర్వీస్ !

Telugu Lo Computer
0


బ్లూ డార్ట్ పేరును భారత్ ప్లస్‌ గా మార్చింది. ఈ మేరకు ప్రకటన చేసింది. ఇకపై బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ కొరియర్ సర్వీసులు భారత్ డార్ట్ పేరుతో కొనసాగుతాయని వెల్లడించింది. బ్లూ డార్ట్ ప్రయాణంలో పేరు మార్పు ఓ మైలురాయి అని అభిప్రాయపడింది. బ్లూ డార్ట్‌ పేరును భారత్ డార్ట్‌గా ఎందుకు మార్చామో ఆ సంస్థ తెలిపింది. భారత్ లోని తమ వినియోగదారులకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. పేరు మార్పుపై ఎంతో పరిశోధన చేశామని చెప్పింది. బ్లూ డార్ట్ కంపెనీ భారత్‌ను ప్రపంచంతో కలిపేందుకు అలాగే ప్రపంచాన్ని భారత్‌తో కలిపేందుకు పేరు మార్పు ఒక భాగం కావాలని ఆశాభావం వ్యక్తం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)