చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత

Telugu Lo Computer
0


స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 19న ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. నేడు తీర్పు వెలువరిస్తూ చంద్రబాబు అభ్యర్థనను తోసిపుచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)