ఉజ్వల యోజన పథకం కింద 75 లక్షల గ్యాస్ కనెక్షన్స్ !

Telugu Lo Computer
0


ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద మహిళలకు అదనంగా 75 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్‌లను అందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే మూడేళ్ల కాలంలో అందించనున్న అదనపు ఎల్‌పీజీ కనెక్షన్‌లకు రూ.16వందల 50 కోట్లు ఖర్చు అవుతాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఉజ్వల 2.0 ప్రకారం లబ్ధిదారులకు రీఫిల్, స్టవ్ కూడా అందించనున్నారు. ఇటీవలే కేంద్రం ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.రెండు వందలు తగ్గించింది. ఈ నిర్ణయంతో ఢిల్లీలో 14.2కిలోల సిలిండర్ ధర రూ.11వందల నుంచి రూ.9వందలకి తగ్గింది. ఉజ్వల గృహాలకు సిలిండర్ కు రూ.2వందల చొప్పున ప్రస్తుత లక్ష్య సబ్సిడీకి అదనంగా ఈ తగ్గింపు కొనసాగుతుంది. ఈ తగ్గింపుతో రూ.703కే సిలిండర్ లభించనుంది. 9.6కోట్ల ఉజ్వల లబ్ధిదారులతో సహా 31కోట్లకు పైగా దేశీయ ఎల్పీజీ వినియోగదారులున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)