మీషో 5 లక్షల ఉద్యోగాలు !

Telugu Lo Computer
0


పండుగల డిమాండ్ తట్టుకునేందుకు దేశంలోని దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలు సన్నాహాలు ప్రారంభించాయి. కోట్ల సంఖ్యలో వచ్చే ఆర్డర్లను వేగంగా కస్టమర్లకు సకాలంలో అందించాలని పెద్ద ప్లాన్స్ వేస్తున్నాయి. సాఫ్ట్‌బ్యాంక్ ఫండెడ్ సంస్థ మీషో రాబోయే పండుగ సీజన్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను నెరవేర్చడానికి సెల్లర్ అండ్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో దాదాపు 5 లక్షల సీజనల్ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇది గత ఏడాది కంటే దాదాపు 50 శాతం ఎక్కువ. Ecom Express, DTDC, Elastic Run, Loadshare, Delhivery, Shadowfax, Xpressbees వంటి థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ ప్లేయర్‌లతో భాగస్వామ్యం ద్వారా సుమారు 2 లక్షల ఉద్యోగ అవకాశాలను ప్రారంభించాలని మీషో లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా డెలివరీ పికింగ్, సార్టింగ్, లోడింగ్, అన్‌లోడ్, రిటర్న్ ఇన్‌స్పెక్షన్‌ల వంటి విధులు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఏడాది పండుగ సీజన్లో కస్టమర్ల నుంచి ఆర్డర్ల డిమాండ్ అధికంగా ఉంటుందని అంచనాలతో కంపెనీ భారీగా ఏర్పాట్లను చేసుకుంటోంది. ఈకామర్స్ సెల్లర్స్ సైతం డిమాండ్ కు అనుగుణంగా స్టాక్ స్టోర్ చేసేందుకు గోదాములను ఏర్పాటు చేసుకుంటున్నట్లు వెల్లడైంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఈ ఏడాది పండుగ నియామకాలు 25 శాతం వృద్ధిని సాధించగలవని అంచనా వేస్తున్నట్లు టీమ్‌లీజ్ తెలిపింది. బెంగుళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి టైర్-1 నగరాలతో పోలిస్తే టైర్-II, టైర్-III నగరాల్లో గిడ్డంగుల కార్యకలాపాలు, చివరి-మైలు డెలివరీ సిబ్బంది, కాల్ సెంటర్ ఆపరేటర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల తన సప్లై చైన్‌లో 1,00,000 కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నట్లు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ తన వార్షిక ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ ది బిగ్ బిలియన్ డేస్ 10వ ఎడిషన్‌ను వచ్చే నెల ప్రారంభంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైలర్ మైంత్రా తన లాజిస్టిక్స్, కాంటాక్ట్ సెంటర్ కార్యకలాపాల్లో మహిళలను నియమించుకుంటుంది. ఈ-కామర్స్ రిటైలర్‌లు ఈ పండుగ సీజన్‌లో రూ.90,000 కోట్ల విక్రయాలను ఆర్జించవచ్చని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)