చంద్రయాన్ 3 ప్రాజెక్టు కోసం పని చేసిన ఉద్యోగి ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు !

Telugu Lo Computer
0


చంద్రయాన్-3 లాంచ్‌ప్యాడ్ నిర్మాణంలో పనిచేసిన టెక్నీషియన్ దీపక్ కుమార్ ఉప్రారియాకు హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ 18 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో రాంచీలో రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్మకుంటున్నాడు. ఈ ప్రయోగంలో హెచ్ఈసీ  - గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ ఫోల్డింగ్ ప్లాట్‌ఫారమ్, స్లైడింగ్ డోర్లను తయారు చేసాయి. అయితే దీపక్ పనిచేసిన హెచ్ఈసీ కంపెనీ 18 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆయన రోడ్ సైడ్ స్టాల్‌ను తెరవాల్సి వచ్చిందంటున్నాడు దీపక్ కుమార్. హెచ్ఈసీలో దాదాపుగా 2 వేల 800 మందికి జీతాలు అందలేదని తెలుస్తోంది. తన పరిస్థితిని దీపక్ కుమార్ వివరిస్తూ జీతాలు రాకపోవడంతో మొదటగా తాను క్రెడిట్ కార్డ్‌తో ఇంటిని నెట్టుకువచ్చానని, దీంతో రెండు లక్షల రూపాయిలు అప్పు చేసినట్లుగా తెలిపాడు. ఆ తరువాత బంధువుల నుండి అప్పు తీసుకొని ఇంటిని నెట్టుకువచ్చానని, దీంతో మరో నాలుగు లక్షల అప్పు అయిందని చెప్పాడు. ఈ క్రమంలో ఇంటి అవసరాలను తీర్చడానికి ఉదయం ఇడ్లీలు అమ్మి, మధ్యాహ్నం ఆఫీసుకి వెళ్తున్నానని, సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ ఇడ్లీలు అమ్ముతానని దీపక్ తెలిపాడు. తన భార్య మంచి ఇడ్లీలు చేస్తుందని వాటిని అమ్మడం ద్వారా తనకు ప్రతిరోజూ రూ.500 రూపాయల లాభం వస్తుందని, ఈ డబ్బుతో తాను ఇంటిని నడుపుతున్నానని తెలిపాడు. దీపక్ కుమార్ 2012 లో రూ.8000 జీతంతో  చేరారు. మంచి గుర్తింపు, భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశపడ్డాను కానీ పరిస్థితులు చివరికి ఇలా వచ్చాయని తెలిపాడు. తన ఇద్దరు కూతుళ్లకు స్కూల్ ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఉన్నట్లుగా దీపక్ కుమార్ చెబుతున్నాడు. ఇతని లాగే హెచ్‌ఇసితో సంబంధం ఉన్న ఉద్యోగులు జీతాలు రాక చాలా మంది జీవనోపాధి కోసం ఏదో ఒక పనిచేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)