17న అఖిల పక్ష భేటీ !

Telugu Lo Computer
0


పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాపై చర్చించేందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ నివాసంలో నేడు కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి అమిత్ షా, అనురాగ్ ఠాకూర్‌లు హాజరయ్యారు. సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 17న అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ అనంతరం ఎజెండాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కొన్ని రోజులుగా దేశంలో రాజకీయంగా వివాదం నెలకొంది. ఈ ప్రత్యేక సమావేశంలోనే దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చనున్నారనే ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్‌లోకి అధికారికంగా మారనున్నారనే మరికొందరు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈ నెల17న అఖిలపక్ష భేటీ ఉంటుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఇప్పటికే ఈ స్పెషల్ సెషన్ ఎజెండా తెలపాలని కాంగ్రెస్ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. ఏ రాజకీయ పార్టీతో చర్చించకుండానే ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంపై ఆమె మండిపడ్డారు. ప్రధాన ఉద్ధేశం ఏంటో తెలిపాలని కోరారు. ప్రత్యేక సమావేశాలను వినాయక చవితి రోజున నిర్వహించడంపై శివ సేన (యూబీటీ) నేత సుప్రీయా సూలే కేంద్రంపై మండిపడ్డారు. హిందువుల పవిత్ర పండగ రోజున పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఎలా నిర్వహిస్తారని దుయ్యబట్టారు.


Post a Comment

0Comments

Post a Comment (0)