బుక్ చేసుకున్న వెంటనే ఐఫోన్‌ 15 డెలివరీ !

Telugu Lo Computer
0


దేశంలో యాపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ సేల్స్ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. కాగా, యాపిల్‌ రిటైల్‌ స్టోర్ల ముందు భారీ క్యూ లైన్‌లో నిలబడకుండానే ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్‌ ను పొందవచ్చు. ఫుడ్ డెలివరీ చేసే ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో సబ్ బ్రాండ్ బ్లింకిట్ ఓ ఆఫర్ ని ప్రకటించింది. బుక్‌ చేసిన పది నిమిషాల్లోనే కొత్త యాపిల్‌ 15 సిరీస్‌ ఫోన్‌ మీ చేతిలో పెడతామని వెల్లడించింది. యాపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్ల విక్రయానికి యాపిల్‌ రీసెల్లర్‌ యూనికార్న్‌ సంస్థ తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్లింకిట్ తెలిపింది. ఈ విషయాన్ని బ్లింకిట్ ఫౌండర్ అల్బిందర్ ధిండ్సా ట్విట్టర్ (ఎక్స్‌) వేదికగా తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, పూణె నగరాల్లో మాత్రమే సేవల అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే మిగతా నగరాలకు విస్తరిస్తామని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)