సచిన్‌ రికార్డును బద్దలుకొట్టిన ఆఫ్గానిస్తాన్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్ !

Telugu Lo Computer
0


ఫ్గానిస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్ అరుదైన ఘనత సాధించాడు. 21 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్బాజ్‌ రికార్డులకెక్కాడు. హంబన్‌టోటా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన గుర్బాజ్‌.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించకున్నాడు. ఇప్పటివరకు వన్డేల్లో గుర్బాజ్‌ 5 సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ రికార్డును గుర్బాజ్ బ్రేక్‌ చేశాడు. సచిన్‌ తన 21 ఏళ్ల వయస్సులో 4 వన్డే సెంచరీలు సాధించాడు. తాజా మ్యాచ్‌తో సచిన్‌ను ఈ ఆఫ్గాన్‌ ఓపెనర్‌ అధిగమించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్‌ ఓపెపర్‌ ‍క్వింటన్‌ డికాక్‌, శ్రీలంక మాజీ ఓపెనర్‌ ఉపుల్‌ తరంగా చెరో 6 సెంచరీలతో అగ్రస్ధానంలో సంయుక్తంగా కొనసాగుతున్నాడు. అదే విధంగా మరో అరుదైన ఘనతను కూడా గుర్భాజ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 5 సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా గుర్భాజ్‌ రికార్డులకెక్కాడు. గుర్బాజ్‌ కేవలం 23 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో బాబర్‌ ఆజం రికార్డును గుర్బాజ్‌ బ్రే​క్‌ చేశాడు. బాబర్‌ 25 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఈ అరుదైన ఫీట్‌ నమోదు చేసిన లిస్ట్‌లో క్వింటన్‌ డికాక్‌(13 ఇన్నింగ్స్‌లు), పాక్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌(13 ఇన్నింగ్స్‌లు) తొలి రెండు స్ధానాల్లో కొనసాగుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)