అండమాన్ లో వరుస భూకంపాలు

Telugu Lo Computer
0


అండమాన్ దీవుల్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు, టూరిస్టులు భయాందోళనకు గురవుతున్నారు. ఆగస్టు 3 తెల్లవారుజామున 61 కిలోమీటర్ల లోతులో అండమాన్, నికోబార్ దీవులలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది. 2023లో ఈ దీవుల్లో సంభవించిన భూకంపాల్లో ఇది ఎనిమిదోది. ఆగస్టు 2న 5.0 తీవ్రతతో వచ్చిన భూకంపంతో దీవులు దద్దరిల్లాయి. ఉదయం 5:40 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం.. ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. జులైలో10 కిలోమీటర్ల లోతులో 6 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. ఏప్రిల్‌లో కాంప్‌బెల్ బేలో 4.4 తీవ్రతతో, మార్చిలో దీవుల్లోని నికోబార్ ప్రాంతంలో 5 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు జనవరిలో అండమాన్ సముద్రంలో తొలి భూకంపం సంభవించింది. 4.9 తీవ్రతతో, 77 కిలోమీటర్ల లోతులో ఇది జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇలా వరుస పెట్టి వస్తున్న భూకంపాలతో అక్కడి వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)