ఇమ్రాన్‌ ఖాన్‌ మళ్లీ అరెస్టు

Telugu Lo Computer
0


ప్రభుత్వ బహుమతులు అక్రమంగా అమ్ముకున్నారనే కేసులో పాక్‌ మాజీ ప్రధాని, పిటిఐ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పాల్గనకుండా ఆయనపై అనర్హత వేటు పడే అవకాశముంది. సెషన్స్‌ కోర్టు తీర్పుపై ఆయన అప్పీలు చేసుకోవచ్చు. నవంబరులో జరిగే పాక్‌ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఇమ్రాన్‌ను లేకుండా చేసేందుకు తోడ్పడేలా ఇస్లామాబాద్‌ జిల్లా కోర్టు తీర్పు ఉందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టు అయిన వెంటనే ఆయన తరపు న్యాయవాది ఇంతెజా పంజోతా రాయిటర్స్‌తో మాట్లాడుతూ, ఈ తీర్పును హైకోర్టులో సవాల్‌ చేస్తామని చెప్పారు. ఈ అరెస్టు ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీని రాజకీయంగా బలహీనపరిచేందుకు వరుసగా జరుగుతున్న దాడుల్లో తాజా చర్యగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇమ్రాన్‌ అటు అమెరికా, ఇటు సైన్యం ఆధిపత్యాన్ని వ్యతిరేకించినప్పటి నుంచి ఆయనను రాజకీయంగా అణగదొక్కే కుతంత్రాలు జోరందుకున్నాయి. ఆయనకు సన్నిహితులుగా వున్నవారిని దూరం చేశారు. పార్టీని చీల్చారు. ఇప్పుడు ఇమ్రాన్‌ను ఏకంగా జైలుకు పంపారు. ఎన్నికల్లో అనర్హత వేటు పడేలా చేశారు. తోషఖానా కేసు విచారణకు స్వీకరించరాదని, విచారించాల్సి వస్తే ఈ కేసును వేరే కోర్టుకు బదలాయించాలని ఇస్లామాబాద్‌ హైకోర్టుతో సహా అనేక ఫోరమ్‌లలోఇమ్రాన్‌ పిటిషన్లు వేశారు. అయితే, హైకోర్టు వాటిని తిరస్కరించడంతో అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి హుమయూన్‌ దిలావర్‌ ఈ కేసులో శనివారం తీర్పు నిస్తూ ఇమ్రాన్‌కు మూడేళ్ళ జైలు శిక్ష, లక్ష రూపాయిల జరిమానా విధించారు. 2020ా21 సంవత్సరానికి ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఆస్తులు, అప్పుల ప్రకటనలో ఇమ్రాన్‌ తప్పుడు డిక్లరేషన్‌ ఇచ్చారని, తోషఖానా రిపోజిటరీ నుండి తాను తీసుకున్న బహుమతుల వివరాలను తప్పుగా ప్రకటించారని న్యాయమూర్తి అన్నారు. విచారణా సమయంలో ఇమ్రాన్‌ గానీ ఆయ తరపు న్యాయవాదులు గానీ కోర్టుకు హాజరు కాలేదు. అదనపు సెషన్స్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఇమ్రాన్‌కు అప్పీల్‌ చేసుకునే హక్కు వుంది. శాంతియుత నిరసనలు కొనసాగించాల్సిందిగా ఇమ్రాన్‌ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. అరెస్టు జరిగిన కొద్ది గంటల తర్వాత ట్విటర్‌లో ముందుగానే రికార్డు చేసిన సందేశాన్ని షేర్‌ చేశారు. ''ఈ సందేశం మీకు చేరే సమయానికి నేను జైల్లో వంఉటాను'' అని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)