హర్యానా ఘర్షణల నుంచి తృటిలో తప్పించుకున్న జడ్జి, మూడేళ్ల కుమార్తె

Telugu Lo Computer
0


ర్యానాలో నూహ్‌ జిల్లాలో రెండు వర్గాల మధ్య హింస చెలరేగడంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో హర్యానాకు చెందిన ఓ జడ్జి, ఆమె మూడేళ్ల కుమార్తె త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అంజలి జైన్, ఆమె మూడేళ్ల కుమార్తె ప్రయాణిస్తున్న కారుపై అల్లరిమూక దాడి చేసింది. తొలుత రాళ్లతో దాడి చేసి తర్వాత కారుకు నిప్పంటిచారు. అప్పుడు కారులో జడ్జితో పాటు కొందరు సిబ్బంది కూడా ఉన్నారు. వారంతా కారు దిగి నూహ్‌లోని పాత బస్టాండ్‌కు వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు. తర్వాత వారిని కొందరు న్యాయవాదులు వచ్చి రక్షించారు. తెల్లారి వెళ్లి కారును చూడగా అది పూర్తిగా దహనమై కనిపించింది. ఈ ఘటనపై కోర్టు సిబ్బంది గుర్తు తెలియని దుండగులపై కేసు పెట్టారు. ప్రస్తుతం నూహ్‌లో కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇంటర్నెట్‌పై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. బుధవారం రాత్రి కొందరు దుండగులు రెండు ప్రార్థనా మందిరాలపై బాంబులు విసిరారు. దాంతో ఆ మందిరాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని గురువారం పోలీసులు తెలిపారు. అలాగే కొన్ని చోట్ల గోదాములు, దుకాణాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. నూహ్‌లో వరుసగా నాలుగో రోజు కర్ఫ్యూ అమల్లో ఉండటంతో గురువారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆంక్షలను సడలించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)