రైల్వే కానిస్టేబుల్‌ చేతన్ సింగ్‌ డిస్మస్ !

Telugu Lo Computer
0


జైపూర్‌-ముంబై రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ కేసులో సోమవారం రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఆర్పీఎప్‌ కానిస్టేబుల్ చేతన్ సింగ్‌ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఆర్పీఎఫ్ డివిజనల్ సెక్యూర్టీ కమీషనర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. చేతన్ సింగ్ ప్రవర్తన సరిగా లేదని, గతంలో అతను మూడుసార్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు. 2017లో ఓ ముస్లిం వ్యక్తిని వేధించాడని, ఉజ్జయినిలో డాగ్ స్క్వాడ్‌లో పనిచేస్తున్నప్పుడు ఆ ఘటన జరిగిందని అధికారి చెప్పారు. ఓసారి గుజరాత్‌లో పనిచేస్తున్నప్పుడు తన సహోద్యోగిని కొట్టాడు. మరోసారి తనతో పనిచేసే వ్యక్తి ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసినట్లు చేతన్‌పై ఆరోపణలు ఉన్నాయి. అయితే జైపూర్ రైలులో సీనియర్‌ను కాల్చి చంపిన ఘటన ఆధారంగా అతన్ని సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చేతన్ సింగ్ ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)