అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో వివేక్ రామస్వామి !

Telugu Lo Computer
0


ప్రపంచ దేశాల్లో భారతీయులు చక్రం తిప్పుతున్నారు. మొన్నటివరకు టెక్ సంస్థలకు బాస్ లుగా నియమితులు కాగా.. ఇప్పుడు ఆ దేశాల రాజకీయాల్లో కీలక పదవులు పొందుతున్నారు. ఉపాధ్యక్షులు, ప్రధాన మంత్రిగా ఇప్పటికే కమలా హారిస్, రిషీ సునాక్ నియమితులు కాగా వారి సరసన మరో భారతీయుడు నిలవనున్నాడు. అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి నిలుచోనున్నాడు. ఈ క్రమంలో వివేక్ కు టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ ప్రశంసలు కురిపించాడు. ఎన్నికల్లో నిలబడుతున్నందుకు పూర్తి మద్దతునిచ్చాడు. వీరిద్దరికి జరిగిన సంభాషణ వీడియోను ఫాక్స్ న్యూస్ యాంకర్ టక్కర్ కార్ల్సన్ తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన మస్క్.. వివేక్ విశ్వసనీయంగా కనిపిస్తున్నాడని కామెంట్ చేశారు. ప్రముఖ వ్యాపార వేత్త అయిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్షుడిగా నిలబడటం గర్వంగా ఉందని కొనియాడారు. ఇటీవల మస్క్ చైనా పర్యటనలో ఉన్నప్పుడు వివేక్ ఆయనను తీవ్రంగా విమర్శించారు. ఈ విషయాన్ని చైనాలోని టెస్లా వైస్ ప్రెసిడెంట్ అక్కడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో మస్క్.. వివేక్ ను పొగడటం గమనార్హం. 

Post a Comment

0Comments

Post a Comment (0)