అమర్‌నాథ్ యాత్ర నేడు నిలిపివేత

Telugu Lo Computer
0


మర్ నాథ్ యాత్ర ను అధికారులు నేడు నిలిపివేశారు. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 ని రద్దు చేసి నేటికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే శనివారం జమ్మూ బేస్ క్యాంప్ నుంచి అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు. ఆ ప్రాంతం నుంచి యాత్రకు వెళ్లేందుకు ఎవరినీ అనుమతించట్లేదు. అధికారుల చర్యతో వందలాది మంది యాత్రికులు క్యాంపులకే పరిమితమయ్యారు. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూ- కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత (జమ్మూ-కశ్మీర్, లడఖ్) ప్రాంతాలుగా ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)