లిఫ్టులో ఇరుక్కున్న వృద్ధురాలు భయంతో గుండె ఆగి మృతి - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 4 August 2023

లిఫ్టులో ఇరుక్కున్న వృద్ధురాలు భయంతో గుండె ఆగి మృతి


త్తరప్రదేశ్ లోని నోయిడాలో ఓ హౌసింగ్ కాంప్లెక్స్‌లో 73 ఏళ్ల ఓ వృద్ధురాలు లిఫ్టు ఎక్కింది. లిఫ్టు పైకి వెళ్తున్న సమయంలో దాని కేబుల్ ఒక్కసారిగా తెగిపోయింది. ఫోర్ల మధ్య పడి లిఫ్టు ఇరుక్కుపోయింది. దీంతో అందులోని వృద్ధురాలికి భయంతో గుండె ఆగి ప్రాణాలు కోల్పోయింది. బహుళ అంతస్తుల భవనంలోని ఓ అంతస్తు వద్ద లిఫ్టు ఇరుక్కుపోయిందని, కేబుల్ తెగినా అది జారి గ్రౌండ్ ఫ్లోర్ లో పడిపోలేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. లిఫ్టులో తలెత్తిన లోపం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. లిఫ్టులో సమస్య తలెత్తిన సమయంలో ఆ వృద్ధురాలు మాత్రమే అందులో ఉందని అధికారులు తెలిపారు. నోయిడాలోని సెక్టార్ 142 ప్రాంత పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 137లో పారాస్ టియెర్రా సొసైటీలో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. లిఫ్టు నుంచి వృద్ధురాలిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారని, ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారని అన్నారు. ఆమె నడుము, తల, మోచేతులపై గాయాలు కూడా కనిపించాయని వివరించారు. ఈ ఘటనతో ఆ హౌసింగ్ కాంప్లెక్స్ వాసులు ఆందోళనకు దిగారు. సరైన మెయింటనెన్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.

No comments:

Post a Comment