మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే డాక్టర్ రంగనాథ్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 2 August 2023

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే డాక్టర్ రంగనాథ్ !


ర్ణాటకలోని తుమకూరు సమీపంలోని యాదవనికి చెందిన శివనంజయ్య అనే రైతు 20 ఏళ్లు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. శివనంజయ్యను పరీక్షించిన డాక్టర్లు అతడు రూమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాడని, మోకాలి కీళ్ల మార్పిడి సర్జరీ చేయాలని సూచించారు. సర్జరీకి రూ.2 లక్షలు ఖర్చవుతుందని, కార్పొరేట్ హాస్పిట్‌లో రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ అతనికి అంత ఆర్థిక స్తోమతలేదు. దీంతో ఆర్థిక సహాయం కోరుతు ఎమ్మెల్యే శివనంజయ్యకు మెరపెట్టుకున్నాడు. అతని పరిస్థితి విన్న ఎమ్మెల్యే ఆర్థిక సహాయం చేయటం కంటే తానే ఉచితంగా సర్జరీ చేస్తే బాగుంటుందని అనుకున్నారు. నీకు సహాయం కంటే సర్జరీ చేయటం మేలు అని చెప్పాడు. దానికి బాధితుడు సంతోషించాడు. ఆర్థిక సహాయం కోసం వస్తే సర్జరీయే చేస్తాననటంతో సంతోషపడ్డాడు. దీంతో తన స్నేహితుడైన డాక్టర్ దీపక్‌తో కలిసి బెంగళూరులోని బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ హాస్పిటల్‌లో శివనంజప్పకు ఉచితంగా ఎడమ మోకాలు సర్జరీ చేశారు. మరో కాలికి కూడా సర్జరీ చేయాలని దానికి మరో మూడు నెలలు ఆగాలని, మూడు నెలలు పోయాక కుడికాలికి కూడా మోకాలి కీలు సర్జరీని కూడా ఉచితంగా చేస్తామని చెప్పారు. దీంతో ఆ రైతు ఆనందపడిపోయాడు.

కాగా..ఎన్నికల ప్రచారం సమయంలో కునిగల్ తాలుకాలోని కుందూరు అనే గ్రామానికి డాక్టర్ రంగనాథ్ వెళ్లారు. ఈక్రమంలో ఆ ఊరికి చెందిన ఆశా శంకర్ అనే 42 ఏళ్ల మహిళ తన ఆరోగ్య పరిస్థితిని గురించి ఆయనకు చెప్పుకుంది. 'నేను స్కూల్లో వంటమనిషిగా పనిచేస్తున్నా, నా భర్త ఆటో డ్రైవర్ 12 ఏళ్ల క్రితం హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్నా, ఇటీవల మా ఇంటి దగ్గర కింద పడిపోయానయ్యా..అప్పటినుంచి తుంటి వద్ద విపరీతంగా నొప్పి వస్తోందని, దీంతో అస్సలు నడవలేకపోతున్నానని, ఆస్పత్రిలో చూపించుకుంటే ఆరేషన్ చేయాలని..రూ.5 నుంచి 6 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు' అని చెప్పి వాపోయింది. దీంతో ఎమ్మెల్యే రంగనాధ్  ఆమెకు ధైర్యం చెప్పారు. ఆమె మెడికల్ రిపోర్టులను పరిశీలించారు. అనంతరం ''ఎన్నికల హడావుడి కాస్త తగ్గనీయమ్మా నీకు నేనే ఫ్రీగా సర్జరీ చేస్తాను''అని భరోసా ఇచ్చారు. కానీ గెలిచాక అది జరిగే పనేనా అని ఆమె అనుకుంది. కానీ గెలిచిన తరువాత కూడా రంగనాధ్  తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత జూన్ 26న ఆమెకు బెంగళూరులోని బౌరింగ్ హాస్పిటల్‌లో ఉచితంగా సర్జరీ చేశారు. కాగా కర్ణాటకలో కాంగ్రెస్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బంధువు అయిన రంగనాథ్ మైసూరులోని జేఎస్ఎస్ మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్స్‌లో మాస్టర్ ఆఫ్ సర్జరీ (ఎంఎస్) పూర్తి చేశారు. అలా డాక్టర్ అయినా ఆయన ప్రజాప్రతినిధిగా మారారు.

No comments:

Post a Comment