ప్రొడ్యూసర్‌కి కలెక్షన్ నిల్లు - ప్యాకేజి స్టార్‌కి పాకెట్ ఫుల్లు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 1 August 2023

ప్రొడ్యూసర్‌కి కలెక్షన్ నిల్లు - ప్యాకేజి స్టార్‌కి పాకెట్ ఫుల్లు !


వన్ కల్యాణ్, సాయిధర్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్రో' సినిమాపై పొలిటికల్ కామెంట్లకు కూడా దారి తీసింది. సినిమా, రాజకీయం వేరైనా బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్రలో నటుడు పృథ్వీ చేసిన డ్యాన్స్‌పై పెద్ద దుమారమే రేగింది. ఇది ఏపీ మంత్రి అంబటి రాంబాబు అప్పట్లో సంక్రాంతి పండుగకు చేసిన డ్యాన్స్‌ను పోలి ఉందని ఆయన వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా 'బ్రో' సినిమా నటులు, నిర్మాతలపై ఫైర్‌ అయ్యారు. ఈ వివాదంపై మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. 'నాది ఆనంద తాండవం.. నీది శునకానందం' అంటూ పవన్ కల్యాణ్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక.. సినిమాల్లో తనను పోలిన పాత్రను పెట్టి, దూషించి శునకానందం పొందడం ఎందుకని ఆయన మండిపడ్డారు. తాజాగా బ్రో సినిమా కలెక్షన్స్‌పై మంత్రి అంబటి రాంబాబు తనదైన స్టైల్‌లో ఇలా కామెంట్‌ చేశారు. 'ప్రొడ్యూసర్‌కి కలెక్షన్ నిల్లు.. ప్యాకేజి స్టార్‌కి పాకెట్ ఫుల్లు !! అని కామెంట్‌ చేశారు. ఒక రకంగా ఇదే నిజం అని కూడా తెలుస్తుంది. 'బ్రో' సినిమాకు సెకండ్​ డే నుంచి కలెక్షన్స్‌ డౌన్ అయ్యాయి. సినిమాకు తొలిరోజు రూ. 30.05 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే రెండో రోజు రూ. 17.05 కోట్లు, 3వ రోజు రూ. 16.9 కోట్లు, ఇక 4న సోమవారం రూ. 5 కోట్లు మాత్రమే వచ్చినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇలా బ్రో సినిమాకు 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 69.9 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు సమాచారం అందించాయి. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న ఏ హీరో సినిమా రిలీజైనా మొదటి రెండు, మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోతుంది. అలాంటిది పవన్ సినిమా 4రోజులు పూర్తి అయినా వంద కోట్ల కలెక్షన్స్‌ రాబట్టకపోవడాన్ని చూస్తే మంత్రి అంబటి రాంబాబు చెప్తుంది నిజమే కదా అంటూ.. అందుకేనేమో ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్‌ పోస్టర్‌ను కూడా ఇప్పటి వరకు మేకర్స్‌ విడుదల చేయలేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.   https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment