రేపటి నుంచి కిలో టమోటా 50 రూపాయలు !

Telugu Lo Computer
0


కిలో టమోటా ధరను 50 రూపాయల రిటైల్ ధరగా అమ్మాలని నేషనల్ కో-ఆపరేటివ్ కన్య్సూమర్స్ ఫెడరేషన్‌కు, నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం నేడు ఆదేశాలిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఆగస్ట్ 15 నుంచి కిలో టమోటా 50 రూపాయలకు, అంతకంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండనుంది. అయితే  వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయక ముందే టమోటా ధరలు దిగొచ్చాయి. ఎన్నడూలేనంత ధరతో చుక్కలు చూపించిన టమాటా రెండు రోజులుగా దిగొస్తోంది. నిన్న మొన్నటి వరకు పలు ప్రాంతాలను బట్టి కిలో రూ.150 నుంచి రూ200 వరకు పలకగా టమాటా కంటే కేజీ చికెన్‌ కొనుక్కోవడం నయం కదా అనుకున్నారు. అంతేకాదు అమ్మో టమాటా అంటూ నోరెళ్లబెట్టారు. అంతలా భారీ ధరతో గుండెదడ సాధారణ, మధ్య తరగతి వారిని దడదడలాడించిన టమాటా ధర క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో రూ.58నుంచి రూ.60వరకు అమ్ముడవుతుండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె, అనంతపురంతో పాటు కర్నాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పండుతున్న టమాటా అందుబాటులోకి రావడంతో ఒక్కసారిగా టమాటా ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)