కారుపై విన్యాసాలు చేసిన వ్యక్తికి 26వేల ఫైన్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 17 August 2023

కారుపై విన్యాసాలు చేసిన వ్యక్తికి 26వేల ఫైన్ !


ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ కారు ఓనర్‌కు.. ఆ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు 26వేల ఫైన్ వేశారు. ఆ కారుపై ఓ వ్యక్తి స్టంట్స్ చేశాడు. తీవ్ర రద్దీ ఉన్న రోడ్డుమీద వెళ్తున్న సమయంలో ఆ వ్యక్తి కారుపైకి ఎక్కి విన్యాసాలు చేశాడు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఆ కారు ఓనర్‌కు జరిమానా విధించారు. నోయిడా సెక్టార్ 18లో ఈ ఘటన జరిగింది. మారుతీ స్విఫ్ట్ కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉంది. ఆ కారుకు ఫైన్ వేసిన చెలాన్‌ను ట్రాఫిక్ పోలీసులు తమ సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. ఆ కారు ఓనర్ పేరు మహేశ్ పాల్ అని ఉంది ఎల్లో రంగ షర్ట్ వేసుకున్న ఓ వ్యక్తి స్విఫ్ట్ కారు రూఫ్‌పై పడుకుని స్టంట్స్ చేశాడు. మరో వ్యక్తి ఆ కారును నడిపాడు. 20 సెకన్లు ఉన్న ఆ క్లిప్‌లో కారు దూసుకెళ్లున్న దృశ్యాలను చూడవచ్చు. కారు రూఫ్‌ను పట్టుకున్న ఆ వ్యక్తి వేలాడుతున్నా డ్రైవర్ మాత్రం ఓవర్‌టేక్ చేస్తూ వెళ్లాడు. నెటిజన్లు ఈ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేయడంతో ట్రాఫిక్ పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఎంవీ యాక్ట్‌తో పాటు టిన్‌టెడ్ గ్లాసు వాడినందుకు ఫైన్ వసూల్ చేశారు.

No comments:

Post a Comment