పాకిస్తాన్‌ లో తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలకు ముప్పు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 31 July 2023

పాకిస్తాన్‌ లో తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలకు ముప్పు !


పాకిస్తాన్‌లోని కరాచీ, లాహోర్‌ నగరాలపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలకు ముప్పు పొంచి ఉందని యూరోపియన్‌ యూనియన్‌ ఏవియేషన్‌ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్‌ఏ) హెచ్చరించింది. గత వారంలో ఈ ఏజెన్సీ ఒక సలహా ప్రకటన జారీ చేసింది. 'ప్రస్తుతం పాకిస్తాన్‌లో కొన్ని హింసాత్మక సమూహాలున్నాయి. వారి వద్ద విమానయాన నిరోధక ఆయుధాలు, 'మ్యాన్‌ప్యాడ్స్‌' (మ్యాన్‌ పోర్టబుల్ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌) ఉన్నాయి. అందువల్ల పౌర విమానయానానికి నిరంతర ముప్పు పొంచి ఉంది. దీని ఫలితంగా 260 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ప్రయాణం చేయడం ప్రమాదకరమని' ఆ ప్రకటనలో పేర్కొంది. 2024 జనవరి 31 వరకు ఈ సూచనలు వర్తిస్తాయని ఈయూ అడ్వైజరీ వెల్లడించింది. యూరోపియన్‌ సంస్థ సలహాను పాకిస్తాన్‌ పౌర విమానయాన అథారిటీ కొట్టిపడేసింది. అన్ని రకాల విమానయాన కార్యకలాపాలకు తమ గగనతలం సురక్షితమైనదని ప్రకటించింది. దీనిపై ద ఎయిర్‌క్రాఫ్ట్‌ ఓనర్స్‌ అండ్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ (ఏఓఓఏ) స్పందిస్తూ తమ దేశ గగనతలం భద్రమైనది, చొరబాట్ల నుంచి రక్షణ కలిగి ఉందని పేర్కొంది. తక్షణమే ఈఏఎస్‌ఏ జారీ చేసిన భద్రతా సర్క్యులర్‌ను ఉప సంహరించుకోవాలని సూచించింది. భయాన్ని ప్రేరేపించడం ద్వారా పాకిస్థాన్‌ను ఆర్థిక కార్యకలాపాల నుంచి తప్పించడానికి ఒక సాకుగా దీన్ని సృష్టించారని ఏఓఓఏ మండిపడింది. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment