వర్షాకాలం - కండ్లకలక - నివారణోపాయాలు !

Telugu Lo Computer
0


ళ్లను ప్రభావితం చేసే ఇన్ఫెక్షనే కండ్లకలక. దీన్ని వైద్య పరిభాషలో 'ఐ ఫ్లూ' లేదా 'పింక్‌ ఐ' అని కూడా పిలుస్తారు. ఇది కంటిని కప్పి ఉంచే స్పష్టమైన పొర కండ్లకలక వాపుకు కారణమవుతుంది. తేమతో కూడిన వాతావరణానికి వైరస్‌లు, బ్యాక్లీరియాలు పెరిగేందుకు ఇది కాస్త అనుకూలంగా ఉంటుంది. దీంతో కళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఎక్కువవుతాయి.  ఏదైనా అలెర్జీ కారకాలు లేదా పొగ, దుమ్ము, పుప్పొడి లేదా రసాయనాల నుండి వచ్చే గాఢతతో కూడిన గాలి కంటి ఫ్లూకి దారితీయవచ్చు. కాంటాక్ట్ లెన్స్‌లను ఎక్కువ కాలం ధరించడం లేదా వాటిని సరిగా శుభ్రం చేయకుండా ధరించడం తదితరాల కారణంగా ఈ కంటి ఇన్ఫెక్షన్ రావచ్చు. అలాగే జలుబు లేదా దగ్గు వంటి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా కూడా ఈ కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గొంతు, కంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే వైరస్ ఒకటే కావడమే అందుకు కారణం. ఈ వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కొలా ఉంటుంది. ఐతే అందరిలో కామన్‌గా కనిపించేది.. స్టికీ డిశ్చార్జ్‌తో కళ్ళు ఎర్రగా ఉంటాయి. దురదగా అనిపించడం.

కళ్ల నుంచి అదేపనిగా నీరు రావడం. కళ్లు తెరవలేకపోవడం, కంటి నొప్పి తదితర లక్షణాలు వ్యాధి సోకిన పేషెంట్‌లో కనిపిస్తాయి. వేడి వాతావరణం నుంచి ఒక్కసారిగా కూల్‌గా మారుతుంది. దీనికితోడు వర్షాకాలం కావడంతో విపరీతమైన నీటి ఎద్దడిన ఉంటుంది. దీంతో నీటి వనరులన్నీ కలుషితమవుతాయి. దీంతో వైరస్‌లు, బ్యాక్టీరియాలు పెరిగేందుకు అనుకూలంగా ఉంటుంది. మనం తెలియకుండా ఆ నీటితో కడుక్కోవడంతో ఈ ఇన్ఫెక్షన్లు, సీజనల్‌ వ్యాధులు అన్ని మూక్ముమ్ముడిగా దాడి చేస్తాయి. ఈ వాతావరణ మార్పులు తగ్గట్టు సరైన శుభ్రత పాటించకపోవడంతో ప్రజలు ఈ వర్షాకాలంలో ఈ వ్యాధుల బారినపడే అవకాశాలు అధికం.

కృత్రిమ కన్నీళ్లు లేదా ఏదైనా లూబ్రికేటింగ్ కంటి చుక్కలను ఉపయోగించడం ప్రభావంతమైన చికిత్సలలో ఒకటి. వేడి నీటితో కాటన్‌ క్లాత్‌ని​ ముంచి కళ్లను కడగడం. పరిశుభ్రతను పాటించాలి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్లతో కూడిన యాంటీబయాటిక్ కంటి చుక్కలు మాత్రమే ఉపయోగించాలి. వ్యాధిని ముదరిపోయేంత వరకు నిర్లక్ష్యం చేస్తే ఈ యాంటిబయోటిక్స్‌ కూడా పనిచేయవని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో కడుక్కోవడం. వెచ్చని నీటితో తరచుగా మీ చేతులను కడగడం వంటివి చేయాలి ముఖ్యంగా మీ కళ్ళను తాకడానికి ముందు లేదా తర్వాత కంటి చుక్కలు వేయండి. మీ కళ్ళను తాకడం లేదా రుద్దడం మానుకోండి ఒకవేళ మీకు కండ్లకలక ఉంటే, శుభ్రమైన, తడి వాష్‌క్లాత్ లేదా తాజా కాటన్ బాల్‌ని ఉపయోగించి మీ కళ్ళను క్లీన్‌ చేసుకోండి. దీంతోపాటు దిండ్లు, వాష్‌క్లాత్‌లు, తువ్వాళ్లు, కంటి చుక్కలు, కన్ను లేదా ముఖ అలంకరణ, మేకప్ బ్రష్‌లు, కాంటాక్ట్ లెన్స్‌లు, కాంటాక్ట్ లెన్స్ నిల్వ కేసులు లేదా కళ్లద్దాలు వంటి వ్యక్తిగత వస్తువులను షేర్ చేయవద్దు. వీటిలో వైరస్ లేదా బాక్టీరియా ఉండే అవకాశం ఉంది. దీంతో ఒకరి నుంచి మరొకరికి ఈజీగా సంక్రమించే అవకాశం ఉంటుంది. మీ తలగడ కవర్‌లను తరుచుగా మార్చండి. వేడినీటి డిజర్జెంట్‌లోను వాష్‌ చేయండి. ప్రతి రోజు శుభ్రమైన టవల్‌ లేదా వాష్‌ చేసిన క్లాత్‌ ఉపయోగించండి. విటమిన్‌ ఏ, సీలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)