మలై మటన్ లో ఎలుక !

Telugu Lo Computer
0

                                            

పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో ఓ రెస్టారెంట్ కు ఓ కుటుంబం వెళ్లింది. అక్కడున్న మెనూ లిస్ట్ చూసి మలై మటన్ కు ఆర్డరిచ్చారు. సర్వర్లు తీసుకొచ్చి వారు కూర్చున్న టేబుల్ దగ్గర ఆ పదార్దాన్ని ఉంచారు. దానిని తినేందుకు స్పూన్స్ కూడా ఇచ్చారు. ఆ స్పూన్ తో అటు ఇటు కదిపగా ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. మలై మటన్ లో ఎలుక మాసం వచ్చింది. అయితే అది కట్ చేయకుండా ఎలుక మాదిరిగా ఉండటంతో దానిని గుర్తించి రెస్టారెంట్ యజమానులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. కాని రెస్టారెంట్ యజమాని కస్టమర్ల వాదనతో ఏకీభవించకుండా కొంతమంది తమ హోటల్ పరువుతీసేందుకు ఇలాంటి ట్రిక్ లను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఆ కస్టమర్లు మలై చికెన్ చనిపోయిన ఎలుక ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మలై చికెన్ కనిపించిన ఎలుక ముక్కలు కాకుండా అలాగే ఉండటంతో కస్టమర్లు గుర్తించగలిగారు. అదే ముక్కలయి ఉంటే మాత్రం దానిని గుర్తించలేకపోయేవారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)