వీధి కుక్కల పేరిట పదెకరాలు !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని పంచోత్‌ గ్రామానికి చెందిన కుక్కలు కోట్లకు అధిపతులు. వాటి పేర ఏకంగా 90 కోట్ల ఆస్తులున్నాయి. వాటి నిర్వహణకు ఓ ట్రస్ట్‌ కూడా ఉంది . ఈ ట్రస్ట్ వీధి కుక్కల పట్ల తీసుకునే కేరింగ్ తో ఈ వీధి శునకాల జీవితమే మారిపోయింది. ఈ వీధికుక్కలు అనుభవించే రాజభోగాలు చూస్తే ఇంట్లో పెరిగే పెంపుడు కుక్కలే కాదు.. సామాన్య మానవులు సైతం అసూయ పడాల్సిందే. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. జంతువులకు సేవ చేస్తే తమకు మంచి జరుగుతుందని మెహసానా జిల్లాలోని పంచోత్ గ్రామ ప్రజలు బలంగా నమ్ముతారు. దీంతో, నిత్యం కళ్లెదురుగా తిరిగే వీధి కుక్కలను బాగా చూసుకోవాలని సేవచేయాలని వారు నిర్ణయించుకున్నారు. వెంటనే స్థానికులు అందరూ కలిసి వీధి కుక్కల కేరింగ్ కోసం ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. తమ స్థాయికి తగినట్లుగా విరాళాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అయితే కొంతమంది వ్యక్తులు కుక్కల కోసం తమ కోట్ల విలువైన భూమిని కూడా ట్రస్ట్ కు ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ కుక్కల పేరిట పదెకరాలు ఉంది. శునకాలకు ఫుడ్ ని అందించేందుకు ఆహారాన్ని తయారు చేసేందుకు కొందరు మహిళలను నియమించుకున్నారు. కుక్కలకు ఆహారాన్ని అందించేందుకు రోజుకు వెయ్యి రొట్టెలు చేస్తారు. వీటిని వాలంటీర్లు శునకాలకు ఇస్తుంటారు. వీధి కుక్కలకు ఆహారాన్ని అందించి తమ బాధ్యత తీరింది అనుకోలేదు ఆ ట్రస్ట్, అనారోగ్యం బారిన పడితే వాటికీ వైద్యాన్ని అందించాలని భావించింది. ఒక వెటర్నరీ డాక్టర్ ను ఏర్పాటు చేసింది. వీధి కుక్క అనారోగ్యం బారిన పడితే వెంటనే వాటికి ఈ పశు వైద్యుడు చికిత్సను అందిస్తాడు. ఈట్రస్ట్ ద్వారా వీధి కుక్కలు అనుభవిస్తున్న రాజభోగాల గురించి తరచుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)