ఆగిన ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ సేవలు !

Telugu Lo Computer
0


ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ టికెటింగ్ సర్వీసులో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో టికెట్ బుకింగ్ సేవలకు అంతరాయం కలిగింది. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతానికి తమ వెబ్‌సైట్, యాప్‌లో టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులో లేవని వెల్లడించింది. సమస్యను పరిష్కరించేందుకు తమ సీఆర్ఐఎస్ సాంకేతిక బృందం ప్రయత్నిస్తోందని తెలిపింది. సమస్య పరిష్కారమై, సేవలు అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని తెలియజేస్తామని ఐఆర్‌సీటీసీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. అప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాలైన ఆమెజాన్, మేక్ మైట్రిప్ వంటి బీ2సీ వేదికల ద్వారా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే, ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ టికెట్లు బుక్ కావడం లేదని పలువురు నెటిజన్లు ఐఆర్‌సీటీసీ ట్వీట్‌కు కామెంట్లు చేస్తున్నారు. త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. డబ్బులు కట్ అవుతున్నాయని.. కానీ టికెట్ బుకింగ్ కన్ఫర్మ్ చేయడం లేదని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. అసలు థర్డ్ పార్టీలో టికెట్లు బుక్ అవుతున్నాయో.. లేదో చెప్పాలని కోరుతున్నారు. మరోవైపు, 'వారు కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఐఆర్‌సీటీసీ నుంచి మేము ఒక నవీకరణను అందుకున్నాం. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి టీమ్ ఇప్పటికే అదే పనిలో ఉంది. కావున కొంత వరకు వేచి ఉండవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము' అని మేక్ మై ట్రిప్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. తొందరలోనే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)