బంపర్ డ్రా గెలుచుకున్న హరిత కర్మ సేన మహిళలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 28 July 2023

బంపర్ డ్రా గెలుచుకున్న హరిత కర్మ సేన మహిళలు !


కేరళ రాష్ట్రంలోని పరప్పన్‌గడీ మున్సిపాలిటీకి చెందిన హరిత కర్మ సేనకు చెందిన ఈ మహిళలు స్థానికంగా నాన్ బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించిన రీసైక్లింగ్ ప్లాంట్‌కు తరలించే పనులు చేస్తుంటారు. అలా వచ్చే కొద్ది పాటి ఆదాయమే వారి జీవనాధారం. ముఖ్యంగా వారి కుటుంబాలకున్న ఏకైక ఆదాయ వనరు. ఈ నేపథ్యంలో ఇటీవల కేరళ బంపర్ డ్రా లాటరీ టిక్కెట్టును కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే, వారివద్ద కేవలం పాతిక రూపాయలు కూడా లేని పరిస్థితి. దీంతో, కొందరు అప్పు చేసి మరీ మొత్తం రూ.250తో ఓ లాటరీ టిక్కెట్టు కొనుక్కున్నారు. బుధవారం కేరళ లాటరీ డిపార్టుమెంట్ లాటరీ నిర్వహించగా వీరికి రూ.10 కోట్ల విలువైన మానసూన్ బంపర్ లాటరీ దక్కింది. దీంతో, ఆ మహిళల ఆనందానికి అంతేలేకుండా పోయింది. తాము జీవితంలో చాలా కష్టాలు పడుతున్నామని, ఈ డబ్బుతో కొంతమేర సమస్యలు తీరుతాయని హర్షం వ్యక్తం చేశారు.  https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment